ఒలింపిక్స్ల్లో మహిళా క్రీడాకారులు తమ హవా కొనసాగిస్తున్నారు. విశ్వక్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా టోక్యో గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ మీరాభాయ్ చాను సిల్వర్ మెడల్‌తో మెరిసింది. దీంతో 2012 లండన్ గేమ్స్ నుంచి వరుసగా మూడో మెగా ఈవెంట్లో మెడల్‌ను సాధించినట్లైంది.
21వ శతాబ్దంలో మొత్తంగా 14 పతకాలు భారత ఖాతాలో చేరగా.. అందులో మహిళ అథ్లెట్లు 6 సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరీ కాంస్య పతకం గెలుపొందింది. ఇక 2004, 2008 విశ్వక్రీడల్లో మహిళలు పతకం లేకుండానే వెనుదిరిగారు. 2012లో తొలిసారిగా ఒకే మెగా ఈవెంట్లో రెండు పతకాలు సాధించారు భారత మహిళలు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కాంస్య పతకాలు దక్కించుకున్నారు.