తెలంగాణ

telangana

ETV Bharat / sports

India at Olympics today : కలిసిరాలేదు.. అన్నింటా ఓటమే - Tokyo Olympic latest news

ఒలింపిక్స్​లో భారత్​కు మంగళవారం కలిసిరాలేదు. పాల్గొన్న అన్నింటిలో పరాజయమే మిగిలింది. పురుషుల హాకీలో 49 ఏళ్ల తర్వాత సెమీస్​ చేరిన టీమ్​ ఇండియా.. ఫైనల్​ చేరలేకపోయింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్​లో 2-5తో ఓటమి చవిచూసింది. అయినా కాంస్య పతకం గెలవడానికి భారత్​కు అవకాశం ఉంది. జావెలిన్​ త్రో, షాట్​ పుట్​, రెజ్లింగ్​, హాకీలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూడండి.

Tokyo Olympics 2020
టోక్యో ఒలింపిక్స్​ 2020

By

Published : Aug 3, 2021, 8:03 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో ఈ మంగళవారం(ఆగస్టు 3) భారత బృందానికి కలిసిరాలేదు. ఆడిన అన్ని ఆటల్లోనూ పరాజయమే మిగిలింది.

మంగళవారం భారత ఫలితాలు ఇవే..

స్వర్ణం ఆశలు ఆవిరి..

నిరాశలో భారత ఆటగాడు

ఒలింపిక్స్​ ఆది నుంచి ఆకట్టుకున్న హాకీ పురుషుల జట్టు తుదిమెట్టుపై బోల్తా పడింది. స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగిన మన్​ప్రీత్​ సింగ్​ సేనకు సెమీస్​లో బెల్జియం చేతిలో భంగపాటు తప్పలేదు. 2-5తో ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక కాంస్య పోరులోనైనా నెగ్గి భారత్​కు కనీసం పతకం దక్కేలా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాంస్య పతకం కోసం.. ఆగస్టు 5న జర్మనీ- ఇండియా తలపడనున్నాయి.

గోల్​ కొట్టిన ఆనందంలో భారత ఆటగాళ్లు

మూడు క్వార్టర్ల వరకు అద్భుతంగా పోరాడిన మన్‌ప్రీత్‌ సేన ఆఖరి క్వార్టర్లో చివరి ఐదు నిమిషాల వరకు విజయంపై ఆశలు రేపడం గమనార్హం. అయితే అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ 19, 49, 53 నిమిషాల్లో హ్యాట్రిక్‌ గోల్స్‌తో టీమ్‌ ఇండియా కలలను చిదిమేశాడు.

గోల్​ కొడుతున్న బెల్జియం ఆటగాడు

నాలుగో క్వార్టర్‌ను 2-2తో మొదలు పెట్టిన రెండు జట్లు ఒత్తిడిలోనే ఆడాయి. అయితే టీమ్‌ ఇండియా పదేపదే బంతిని అడ్డుకోవడం వల్ల బెల్జియంకు ఆయాచితంగా వరుసగా పెనాల్టీ కార్నర్లు వచ్చాయి. మరోసారి హెండ్రిక్స్‌ ఒక పీసీని, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్స్‌గా మలచడం వల్ల బెల్జియం 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఆట ముగిసే ఆఖరి సెకన్లోనూ దొహెమన్‌ గోల్‌ చేసి బెల్జియంను 5-2తో గెలిపించాడు.

విజయానందంలో బెల్జియం ఆటగాళ్లు

సోనమ్​ తొలి రౌండ్​లోనే..

అచ్చొచ్చిన రెజ్లింగ్​లోనూ భారత్​కు నిరాశే ఎదురైంది. కెరీర్​లో తొలి ఒలింపిక్స్​ ఆడుతున్న​ సోనమ్​ మాలిక్​ తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది. 62 కేజీల విభాగంలో పోటీపడిన సోనమ్​.. మంగోలియా రెజ్లర్​ బోలోర్తుయా ఖురేల్ఖుపై 2-2 తేడాతో పరాజయం చవిచూసింది.

ప్రత్యర్థితో తలపడుతున్న సోనమ్​

తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఈ 19 ఏళ్ల భారత రెజ్లర్​. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను(టేక్‌ డౌన్‌) ఎత్తిపడేసింది. దీంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్‌ చేసింది మంగోలియన్‌ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు.

షాట్​పుట్​..

షాట్​పుట్​ విసురుతున్న తజిందర్​పాల్​

టోక్యో ఒలింపిక్స్​లో భారత అథ్లెట్​ తజిందర్​ పాల్ సింగ్​ క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే వెనుదిరిగాడు. అర్హత మ్యాచ్​లో 21.20 మీ. దూరం షాట్​పుట్​ను విసరాల్సి ఉంది. కానీ, తన తొలి ప్రయత్నంలో అతడు 19.99 మీ. మాత్రమే విసిరాడు. తర్వాత రెండు సార్లు ఫౌల్​ వేశాడు. దీంతో 13వ స్థానంతో విశ్వక్రీడల నుంచి తప్పుకున్నాడు.

జావెలిన్​ త్రో..

భారత మహిళ జావెలిన్​ త్రో క్రీడాకారిణి అన్ను రాణి ఒలింపిక్స్​ క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే విఫలమైంది. 14వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి ప్రయత్నంలో 50.35 మీ. విసిరిన అన్ను.. తర్వాత వరుసగా 53.19 మీ., 54.04 మీ. విసిరింది.

అన్ను రాణి

ఫైనల్​కు అర్హత సాధించాలంటే 63 మీ. దూరం విసరాల్సి ఉంది. పోలండ్ అమ్మాయి మరియా 65.24 మీ. విసిరి ఫైనల్​కు అర్హత పొందింది.

ఇవీ చదవండి:

రెండు పతకాలతో రికార్డు.. ఒకరు జైల్లో, మరొకరు గుండెల్లో!

సుప్రీం ఆదేశించినా.. పారాలింపియన్​కు తప్పని నిరాశ!

ABOUT THE AUTHOR

...view details