తెలంగాణ

telangana

ETV Bharat / sports

49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​ సెమీస్​లో భారత హాకీ జట్టు - ఒలింపిక్స్ న్యూస్

Men's Hockey team
హాకీ జట్టు

By

Published : Aug 1, 2021, 7:04 PM IST

Updated : Aug 1, 2021, 9:40 PM IST

19:03 August 01

గ్రేట్​ బ్రిటన్​ జట్టుపై విజయం

భారత హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్​లో అదరగొట్టిన భారత హాకీ జట్టు.. సెమీస్​లోకి దూసుకెళ్లింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించింది.

ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. 49 ఏళ్ల విరామం తర్వాత సెమీస్​కు అర్హత సాధించింది.  

గ్రేట్​ బ్రిటన్​తో ఆదివారం జరిగిన క్వార్టర్స్​ ఫైనల్​ మ్యాచ్​లో 3-1 తేడాతో గెలిచిన మన టీమ్.. సెమీస్​లో బెల్జియంతో మంగళవారం తలపడనుంది.

భారత్​ తరఫున దిల్​ప్రీతి సింగ్(7వ నిమిషం), గుర్జాంత్ సింగ్(16వ), హార్దిక్ సింగ్(57వ) గోల్స్ చేశారు. బ్రిటన్ జట్టులోని సామ్ వార్డ్​ ఏకైక్ గోల్ చేశాడు.

1972 ఒలింపిక్స్​లో చివరగా సెమీస్​ ఆడిన భారత జట్టు.. పాకిస్థాన్​ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది. అయితే 1980లో భారత్ గోల్డ్​ మెడల్ గెలిచినప్పటికీ, ఆ ఏడాది ఆరు జట్లే ఆడటం వల్ల సెమీస్​ లేకుండానే ఫైనల్​ పెట్టేశారు. 

Last Updated : Aug 1, 2021, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details