టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మంగళవారం స్వదేశంలో అడుగుపెట్టింది. దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సింధుకు అధికారులు ఘనస్వాగతం పలికారు. భారత్ చేరుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆమె.. కెరీర్లో తాను పనిచేసిన కోచ్‌లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది.
"2024లో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా ఉత్తమంగా రాణిస్తాను. దాని కోసం సన్నద్ధమయ్యేందుకు మనకెంతో సమయం ఉంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించడాన్ని ఆస్వాదిస్తున్నాను. నేను పనిచేసిన ప్రతీ కోచ్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి కోచ్‌కు.. విభిన్న శైలి, విభిన్నమైన టెక్నిక్స్ ఉంటాయి. వారి నుంచి ఎంతోకొంత నేర్చుకొని.. అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ఆటలోని టెక్నిక్స్, స్కిల్స్‌పై ఎక్కువ దృష్టి సారించేందుకు అవసరమైన సమయం ఉంది."