టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్‌కు(Bhavina Patel) భారీ నజరానా ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. రూ. 3 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
గుజరాత్ మహేసాణా జిల్లాలోని సుంధియా గ్రామానికి చెందిన భవీనా(bhavina patel paralympics).. పారాలింపిక్స్‌లో ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్(Bhavina Patel Final)లో చైనా ప్లేయర్ యింగ్ ఝోపై 0-3తో ఓడి రజతం సొంతం చేసుకుంది.
పతకం సాధించిన భవీనాను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అభినందించారు. 'మహేసాణా ముద్దుబిడ్డ.. టేబుల్ టెన్నిస్‌లో పతకం సాధించి దేశం గర్వించేలా చేసింది' అని అన్నారు. 'దివ్యాంగ్ ఖేల్ ప్రతిభా ప్రోత్సాహన్ పురస్కార్ యోజన' కింద భవీనాకు రూ. 3 కోట్ల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు.. భవీనాకు రూ. 31 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(TTFI President) అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ప్రకటించారు.
వారికి అంకితమిస్తున్నా..
"నా ప్రదర్శనపై కొద్దిగా నిరాశతో ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నా స్థాయి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ, వచ్చే టోర్నమెంట్‌లో ఈ లోపాలను సరిదిద్దుకుంటా. ఏ అథ్లెట్ అయినా వంద శాతం ప్రదర్శన ఇస్తే ఓడిపోరు అని నేను నమ్ముతా. నాకు ఎదురయ్యే సమస్యలతో నేనెప్పుడూ కుంగిపోను. ఎందుకంటే ఒక దారి మూసుకుపోతే.. భగవంతుడు మరిన్ని అవకాశాలు ఇస్తాడని నమ్ముతా" అని భవీనా(Bhavina Patel final) తెలిపింది.