ఆమె పేరు కేయులా నిద్రియా పెరీరా. చూపులేని స్ప్రింటర్. టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics) 200 మీటర్ల పరుగుపందెంలో సెమీఫైనల్స్ క్వాలిఫైంగ్ రౌండ్‌లో చివర్లో ఓడిపోయింది. అయినా సరే ఆమె ఏమీ ఒట్టి చేతులతో వెళ్లడం లేదు. అదేంటి పతకం గెలువకపోయినా.. ఏమీ సాధించింది అనేగా మీ ప్రశ్న? ఆ ఒలింపిక్ గడ్డ అందరికీ గెలుపోటముల అనుభవాలను ఇస్తే.. ఆమెకు మాత్రం జీవిత భాగస్వామినిచ్చింది.
Tokyo Paralympics: పారాలింపిక్స్‌లో లవ్ ప్రపోజల్ సీన్ - పారాలింపిక్స్ 2021
టోక్యో పారాలింపిక్స్‌లో(Tokyo Paralympics 2021) ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. 200 మీటర్ల పరుగుపందెం పోటీ.. సెమీఫైనల్స్ క్వాలిఫైయింగ్ రౌండ్ చివర్లో ఓడిపోయినా జీవిత భాగస్వామిని సంపాదించింది స్ప్రింటర్ కేయులా నిద్రియా పెరీరా.
టోర్నమెంట్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిపోవడంతో పెరీరా నిరుత్సాహంగా ఉంది. అప్పుడే తన వద్దకు వచ్చాడు కోచ్ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా. అంతే మోకాళ్ల మీద కూర్చుని 'నన్ను పెళ్లి చేసుకుంటావా'(Love Proposal) అని అడిగాడు. దానికామె 'అవును' అనడంతో ఒక్కసారిగా అక్కడ ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. ఈ సర్‌ప్రైజ్ లవ్ ట్రాక్‌ను టోక్యో 2020 పారాఅథ్లెటిక్స్ అధికారిక ట్విటర్‌లో షేర్‌చేయగా.. నెటిజన్ల మనసు దోచుకుంది. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీట్ చేసింది. 15 ఏళ్ల నుంచే అథ్లెట్‌గా మారిన కేయులా నిద్రియాను 2012లో ఆఫ్రికాలోని కేప్ వర్డే ప్రభుత్వం స్పోర్ట్స్ మెరిట్ మెడల్‌తో సత్కరించింది.
ఇదీ చదవండి:Tokyo paralympics: భారత్ ఖాతాలో మరో పతకం- ఆర్చరీలో కాంస్యం