తెలంగాణ

telangana

ETV Bharat / sports

Bhavina Patel: 'ఒత్తిడిని జయిస్తే విజయం నీదే' - భవీనాబెన్​ పటేల్

టోక్యో పారాలింపిక్స్​ టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​కు దూసుకెళ్లిన భవీనాబెన్ పటేల్​ను (Bhavina Patel) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. తుదిపోరులోనూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విజయాన్ని అందుకోవాలని సూచించారు.

pm modi
ప్రధాని మోదీ

By

Published : Aug 28, 2021, 12:50 PM IST

Updated : Aug 28, 2021, 1:06 PM IST

టోక్యో పారాలింపిక్స్​లో అద్భుత ప్రదర్శన చేసిన టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్​కు (Bhavina Patel).. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్​ పోరులో ఎటువంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. భవీనా విజయం కోసం దేశమంతా ప్రార్థిస్తుందని ప్రధాని తెలిపారు.

"అద్భుత విజయాన్ని సాధించిన భవీనాకు శుభాకాంక్షలు. దేశం మొత్తం నీ విజయం కోసం ప్రార్థిస్తుంది. తుదిపోరులో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా నీ కలను సాకారం చేసుకోవాలి. రేపటి నీ గెలుపును ఆస్వాదించడానికి యావత్​ భారతావని ఎదురుచూస్తోంది. నీ ఆట భవిష్యత్​ తరాలకు స్ఫూర్తినిస్తుంది" అని మోదీ ట్వీట్ చేశారు.

సెమీస్​లో చైనా ప్లేయర్​ మియావో జాంగ్​పై 3-2తో విజయం సాధించింది భవీనా పటేల్. ఈ ఘనత సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్​గా నిలిచింది. ఇక ఆదివారం జరగనున్న తుదిపోరులో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

ఇదీ చదవండి:Bhavina Patel:​ టీటీ ఫైనల్లో భవీనాబెన్​.. స్వర్ణంపైనే గురి

Last Updated : Aug 28, 2021, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details