తెలంగాణ

telangana

ETV Bharat / sports

షూటింగ్​లో నిరాశ.. బాక్సింగ్​, హాకీలో విజయాలు

టోక్యో ఒలింపిక్స్​లో పతకం ఖాయమనుకున్న షూటింగ్​లో భారత అథ్లెట్లు ఘోరంగా విఫలమయ్యారు. 10మీ. ఎయిర్​ పిస్టల్​, ఎయిర్​ రైఫిల్స్​ విభాగాల్లో భారత్ కథ ముగిసింది. టీటీలోనూ ఆచంట కమల్​ చేతులెత్తేశాడు. హాకీలో మన్​ప్రీత్ సేన విజయం సాధించగా.. బాక్సింగ్​లో లవ్లీనా పతకాశలు రేపుతోంది. ఇక బ్యాడ్మింటన్​లో డబుల్స్​ జోడీ గెలిచిప్పటికీ క్వార్టర్స్​కు అర్హత సాధించడంలో విఫలమైంది.

hjockey india, lovlina
హాకీ ఇండియా, లవ్లీనా

By

Published : Jul 27, 2021, 12:24 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో ఐదో రోజూ భారత బృందం నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హాకీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్​లో విజయాలు నమోదు కాగా.. షూటింగ్, టీటీ​ ఈవెంట్లలో ఘోరంగా విఫలమయ్యారు భారత అథ్లెట్లు.

మంగళవారం ఫలితాలు ఇవే..

ఊరించి.. నిరాశ పరిచి..

10మీ. ఎయిర్​ పిస్టల్​ మిక్స్​డ్ టీమ్ విభాగంలో క్వాలిఫికేషన్ స్టేజీ 1లో భారత జోడీ ఆశలు రేపింది. మను-సౌరభ్​ దూకుడుగా పాయింట్లు సాధించారు. 582 పాయింట్లతో ఏకంగా అగ్రస్థానంలో నిలిచారు. ఇంకేముంది మరో క్వాలిఫికేషన్ రౌండ్​లో టాప్​-4లో నిలిస్తే చాలు ఏదో పతకం ఖాయమనుకుంది యావత్​ భారతావని.

కానీ, అంతలోనే తేలిపోయారు భారత షూటర్లు. క్వాలిఫికేషన్ స్టేజీ 2లో విఫలమయ్యారు. 400 పాయింట్లకు గానూ 380 మాత్రమే సాధించింది మను-సౌరభ్ జంట. తొలి సిరీస్​లో ఈ ద్వయం 188 పాయింట్లు.. రెండో సిరీస్​లో 192 పాయింట్లు జోడించింది. దీంతో ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది. మొత్తంగా తుది ఎనిమిది మందిలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో పతకం దక్కుతుందనుకున్న ఈవెంట్​లోనూ ఆశలు అడియాశలయ్యాయి.

ఇదే విభాగంలో పాల్గొన్న మరో భారత జంట యశస్విని- అభిషేక్ వర్మ జోడీ కూడా నిరాశపరిచింది. ఈ ఈవెంట్​లో 17వ స్థానంతో సరిపెట్టుకుంది.

రైఫిల్స్​లోనూ..

10మీ. ఎయిర్​ రైఫిల్స్​ మిక్స్​డ్​ టీమ్ విభాగంలోనూ భారత షూటర్లు మెడల్​ మ్యాచ్​కు అర్హత సాధించలేకపోయారు. వలరివన్​- దివ్యాన్ష్​ జోడీ 12వ స్థానంలో నిలవగా.. అంజుమ్​ దీపక్​ జోడీ 18వ స్థానంతో సరిపెట్టుకుంది.

హాకీలో సత్తా..

మంగళవారం ఆటలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసింది భారత పురుషుల జట్టు. హాకీలో మన్​ప్రీత్​ సేన అదరగొట్టింది. స్పెయిన్​తో జరిగిన మ్యాచ్​లో 3-0తో గెలిచి క్వార్టర్స్​ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటివరకు 3 మ్యాచ్​లు ఆడిన ఇండియా.. రెండింటిలో విజయం సాధించింది. తదుపరి అర్జెంటీనా, జపాన్​తో తలపడనుంది.

తాజా మ్యాచ్​లో రూపిందర్​పాల్ సింగ్​ రెండు గోల్స్​తో ఆకట్టుకోగా.. సిమ్రన్​జీత్​ సింగ్​ 13వ నిమిషంలో భారత్​కు తొలి గోల్​ను అందించాడు. 15వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్​ను సద్వినియోగం చేసుకుని రూపిందర్​ రెండో గోల్ చేశాడు. చివరి క్వార్టర్​లో మరో గోల్​తో మొత్తం ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. తొలి మ్యాచ్​లో న్యూజిలాండ్​పై 3-2 తేడాతో గెలిచిన మన్​ప్రీత్​ సేన, ఆ తర్వాత ఆసీస్​ చేతిలో 7-1 తేడాతో చిత్తయింది.

ఇదీ చదవండి:C. A. Bhavani Devi: 'అమ్మ నగలమ్మి ఫెన్సింగ్ కిట్​ కొన్నా'

టీటీలో శరత్​కు ఓటమి..

టేబుల్​ టెన్నిస్​లో భారత్​ కథ ముగిసింది. పురుషుల సింగిల్స్​ రౌండ్​ 3లో ఆచంట శరత్​ కమల్​ ఓటమి చెందాడు. చైనా ఆటగాడు మా లాంగ్​ చేతిలో 4-1(11-7, 8-11, 13011, 11-4, 11-4) తేడాతో పరాజయం పాలయ్యాడు. తొలి రెండు గేముల్లో కనీస పోరాటం చూపిన కమల్​.. తర్వాత పూర్తిగా చేతులెత్తేశాడు.

తొలి గేమ్​ను 7-11తో ప్రత్యర్థి గెలుపొందగా.. 11-8తో రెండో గేమ్​లో ఆధిక్యంలోకి వచ్చాడు కమల్​. మూడో రౌండ్​ హోరాహోరీగా సాగినప్పటికీ ప్రత్యర్థి ముందు నిలవలేకపోయాడు భారత ఆటగాడు. వరుసగా చివరి మూడు రౌండ్లు గెలిచిన మా లాంగ్​ విజేతగా నిలిచాడు.

బ్యాడ్మింటన్​..

సాత్విక్​- చిరాగ్ జోడీ​.. గ్రేట్​ బ్రిటన్​ వెండీ-లేన్​ జంటపై 21-17, 21-19 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. అయినప్పటికీ క్వార్టర్స్​కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్​-ఏలో పాయింట్ల పట్టికలో ఇండోనేసియా, చైనీస్ తైపీ మెరుగైన స్థానాల్లో ఉండటమే ఇందుకు కారణం.

మొత్తంగా మూడు మ్యాచ్​లు ఆడిన భారత డబుల్స్ జోడీ తొలి మ్యాచ్​లో చైనీస్​ తైపీని 21-16, 16-21, 27-25 తేడాతో ఓడించింది. ఇండోనేసియాతో జరిగిన రెండో మ్యాచ్​లో 21-13, 21-12తో ఓడిపోయింది భారత ద్వయం.

బాక్సింగ్​లో మెరిసిన లవ్లీనా..

మహిళల 69 కేజీల విభాగంలో జర్మనీ బాక్సర్​ నదైన్ అపెట్జ్​పై 3-2 తేడాతో గెలుపొందింది భారత బాక్సర్​ లవ్లీనా. ఆమె తదుపరి శుక్రవారం జరిగే రెండో క్వార్టర్స్​లో చైనీస్​ తైపీ బాక్సర్​ చెన్​ నీన్ చిన్​తో తలపడనుంది.

ఇదీ చదవండి:Tokyo Olympics: వీరు బరిలో దిగితే గురి తప్పదంతే..

ABOUT THE AUTHOR

...view details