టోక్యో ఒలింపిక్స్ భారత స్టార్ రెజ్లర్.. పసిడి ఆశలు మధ్యలోనే చెదిరిపోయాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో ఓటమిపాలైంది. దీనిపై వినేశ్ ఫొగాట్ కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు.
వినేశ్ ఫొగాట్ నుంచి తాము పసిడి పతకం ఆశించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక విదేశీ కోచ్‌లపై తనకు నమ్మకం లేదని.. వినేశ్ ఫొగాట్ పెద్దనాన్న, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ సింగ్ ఫొగాట్ అన్నారు. తర్వాతి ఒలింపిక్స్‌లో వినేశ్‌కు తానే శిక్షణ ఇచ్చి, బంగారం పతకం గెలిచేలా చేస్తానని చెప్పారు.