టోక్యో ఒలింపిక్స్లో రజత పతక విజేత రెజ్లర్ రవి దహియాకు అరుదైన గౌరవం దక్కింది. దిల్లీలో అతను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలకు తన పేరును పెట్టారు. ఆదర్శ్నగర్లో ఉన్న ఈ పాఠశాలకు రహిదహియా బాల విద్యాలయగా పేరు మార్చారు. ఈ విషయాన్ని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసొడియా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
మంగళవారం ఈ పాఠశాలలో రవి దహియాకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఉపాధ్యాయులంతా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు.