తెలంగాణ

telangana

ETV Bharat / sports

శిష్యురాలికి గోల్డ్​ మెడల్​- గంతులేసిన కోచ్​! - ఆస్ట్రేలియా గోల్డ్ మెడల్

ఓడిన ప్లేయర్ల కంటతడి దృశ్యాలు ఓ వైపు.. గెలిచిన వాళ్ల విజయోత్సవాలు మరోవైపు. ఇలా.. ఎన్నో విభిన్న ఘట్టాలకు సాక్ష్యంగా నిలుస్తోంది టోక్యో ఒలింపిక్స్​. ఇదే తరహాలో.. తన శిష్యురాలు పసిడి పతకం గెలచిందని ఓ గురువు తెగ ఆనందపడిపోయాడు. స్టాండ్స్​లో అదిరిపోయే రేంజ్​లో చిందులేశాడు.

coach celebrations
కోచ్​ ఆనందోత్సాహం

By

Published : Jul 26, 2021, 1:47 PM IST

Updated : Jul 26, 2021, 1:57 PM IST

ఏ గురువైనా తన శిష్యులు.. గొప్పగా ఏదైనా సాధిస్తే ఎంతో మురిసిపోతారు. అలాంటిది ప్రపంచం స్థాయి ప్లేయర్లతో పోటీ పడి గెలిస్తే ఆ గురువుకు ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనే టోక్యో ఒలింపిక్స్​లో కనిపించింది. తన శిష్యురాలు గోల్డ్​ మెడల్​ గెలుచుకుంది. దీంతో సదరు కోచ్​ ఆనందం పట్టలేక, తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు.

అసలేమైందంటే..?

ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మర్ ఆరియార్నె​ టిట్​మస్​.. టోక్యో ఒలింపిక్స్​లో నాలుగు వందల మీటర్ల రిలే స్విమ్మింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. తన శిష్యురాలు అరియార్నె​​ విజయం సాధించిందని తెలియగానే, కోచ్​ డీన్​ బాక్సాల్​ తెగ సంతోషపడిపోయాడు. ఆనందం పట్టలేక.. స్టాండ్స్​లో చిందులు వేశాడు. గట్టిగట్టిగా అరుస్తూ.. సక్సెస్​ను ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు!

డీన్​ బాక్సాల్​ చిందులు వేస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. బాక్సాల్​ 2019 సంవత్సరానికిగానూ ఆస్ట్రేలియాలో 'కోచ్​ ఆఫ్​ ద ఇయర్' పురస్కారాన్ని గెలుచుకోవడం విశేషం.

ఇవీ చూడండి:

Last Updated : Jul 26, 2021, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details