ఒలింపిక్స్‌లో భారత ఏకైక ఫెన్సర్ భవానీ దేవి స్ఫూర్తిదాయక ప్రదర్శన ముగిసింది. తొలి రౌండ్లో ఘన విజయం సాధించిన ఆమె.. రెండో రౌండ్లో ఓటమి పాలైంది. ప్రపంచ మూడో ర్యాంకర్‌తో పోరాడి వెనుదిరిగింది. ఆమె పతకం తేనప్పటికీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడిన మొదటి క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోనుంది.
తొలి రౌండ్లో అదుర్స్
ప్రపంచ 42వ ర్యాంకు భవానీ దేవీ తొలిరౌండ్లో ట్యునీషియా అమ్మాయి నడియా బెన్ అజిజిపై తిరుగులేని విజయం సాధించింది. 15-3తో అదరగొట్టింది. రెండు పిరియడ్లలోనూ దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థిని అసలు తేరుకోనివ్వలేదు. కత్తియుద్ధంలో మొదట 15 పాయింట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అవతలి వారిని కత్తితో స్పర్శించిన ప్రతిసారీ ఒక పాయింటు ఇస్తారు.
స్ఫూర్తిదాయక ప్రదర్శన
రెండోరౌండ్లో భవానీకి కఠిన ప్రత్యర్థి ఎదురైంది. రియో ఒలింపిక్స్ సెమీ ఫైనలిస్టు, ప్రపంచ మూడో ర్యాంకు మేనన్ బ్రూనెట్ (ఫ్రాన్స్)తో ఆమె తలపడింది. బలమైన ప్రత్యర్థే అయినా భవానీ తెగువ చూపించింది. అయితే ‘రైట్ ఆఫ్ వే’ నిబంధన ప్రకారం మేనన్‌కు అధిక పాయింట్లు లభించాయి. అంటే.. ఇద్దరు ఫెన్సర్లు ఒకరినొకరు కత్తులతో స్పర్శించినప్పుడు ముందుగా దూకుడు ప్రదర్శించిన వారికి పాయింట్లు కేటాయిస్తారు.
ఒత్తిడితో నిండిన పోటీల్లో అనుభవం లేకపోవడం వల్ల భవానీకి కలిసిరాలేదు. మొదటి పిరియడ్‌లో కేవలం 2 పాయింట్లే సాధించింది. 2-8 తేడాతో వెనకబడిన ఆమె రెండో పిరయడ్లో దూకుడు పెంచింది. ప్రత్యర్థి ఆధిక్యాన్ని 6-12కు తగ్గించింది. విజయానికి మరో 3 పాయింట్లే అవసరం కావడం వల్ల మేనన్ సునాయాసంగా క్వార్టర్‌ఫైనల్ చేరుకుంది.
ఇవీ చదవండి: