తెలంగాణ

telangana

ETV Bharat / sports

India at Olympics: ఆరో రోజు అదుర్స్​.. ఆశలన్నీ వీరిపైనే.. - olympics sportspersons gallery

ఒలింపిక్స్​లో భారత్​కు.. గురువారం ఆశాజనక ఫలితాలు వచ్చాయి. పలువురు పతకాలు సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు, బాక్సింగ్​లో సతీశ్​ కుమార్​ క్వార్టర్​ పైనల్లోకి దూసుకెళ్లగా.. ఆర్చరీలో అతాను దాస్​ ప్రీక్వార్టర్స్​, హాకీలో టీమ్​ ఇండియా క్వార్టర్స్​ బెర్తు ఖాయం చేసుకున్నాయి. మరొక్క మ్యాచ్​ గెలిస్తే.. వీరంతా పతకాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

manu bhaker, sindhu, boxer satish
పీవీ సింధు, అతాను దాస్​, సతీశ్​ కుమార్​, మను బాకర్​

By

Published : Jul 29, 2021, 12:00 PM IST

Updated : Jul 29, 2021, 4:28 PM IST

ఒలింపిక్స్​లో భారత పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్​ లిఫ్టింగ్​లో మీరాబాయి చాను రజతం గెలవగా.. మరో పతకం కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన షూటర్లు విఫలమయ్యారు. టేబుల్​ టెన్నిస్​లో నిరాశే ఎదురైంది. సెయిలింగ్​, రోయింగ్​, ఫెన్సింగ్​, స్విమ్మింగ్​లో పోరాడినా ఫలితం లేకపోయింది.

అయితే గురువారం.. బ్యాడ్మింటన్​లో పీవీ సింధు, ఆర్చరీలో అతాను దాస్​, బాక్సింగ్​లో సతీశ్​ కుమార్​, టీమ్​ ఇండియా హాకీ జట్టు, షూటింగ్​లో మను బాకర్​ తమ తమ విభాగాల్లో రాణించి పతకాలపై ఆశలు పెంచుతున్నారు.

ఇంకా ఆర్చరీ మహిళల విభాగంలో ప్రీక్వార్టర్స్​లోకి ప్రవేశించిన దీపికా కుమారిపైనా భారీ అంచనాలున్నాయి.

ఒలింపిక్స్​లో ఆరో రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందో దిగువ ఫొటోల్లో చూద్దాం..

క్వార్టర్​ ఫైనల్లోకి సింధు..

పతకంపై ఆశలు రేపుతున్న షట్లర్​ పీవీ సింధు
ప్రీక్వార్టర్​ ఫైనల్లో డెన్మార్క్​ షట్లర్​పై వరుస సెట్లలో గెలిచి క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించిన సింధు
సింధు చేతిలో ఓడిపోయిన మియా బ్లిక్​ఫెల్ట్ డెన్మార్క్​ షట్లర్​ మియా
21-15, 21-13 తేడాతో చిత్తు చేసిన సింధు
క్వార్టర్​ ఫైనల్లో జపాన్​ షట్లర్​ అకానె యమగూచితో తలపడనున్న సింధు

హాకీలో డిఫెండింగ్​ ఛాంపియన్​పై విజయం..

ఒలింపిక్స్​ హాకీ పూల్​ ఏ మ్యాచ్​లో అర్జెంటీనాపై 3-1 తేడాతో గెలిచిన భారత్​
డిఫెండింగ్​ ఛాంపియన్​ అర్జెంటీనాపై గెలిచిన ఆనందంలో భారత హాకీ ఆటగాళ్లు
హాకీలో 4 మ్యాచ్​ల్లో 3 విజయాలతో క్వార్టర్​ ఫైనల్​ బెర్తు దాదాపు ఖాయం చేసుకున్న టీమ్​ ఇండియా
విజయోత్సాహంలో భారత హాకీ జట్టు

అతాను దాస్​ అదుర్స్​..

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్​ పోటీల్లో గెలిచి.. ప్రీక్వార్టర్స్​ చేరిన అతాను దాస్​
కొరియా ప్లేయర్​పై గెలిచిన ఆనందంలో అతాను దాస్​
అతాను చేతిలో ఓడిన దక్షిణ కొరియా టాప్​ ఆర్చర్​, రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్​ ​ ఓ జిన్​ హయక్​
ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రీక్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించిన ప్రపంచ నెం.1 ఆర్చర్​ దీపికా కుమారి(అతాను దాస్​ భార్య)

పతకానికి పంచ్​ దూరంలో సతీశ్​ కుమార్​..

91 కేజీలు ప్లస్​ విభాగంలో నెగ్గి.. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించిన సతీశ్​ కుమార్​
జమైకా బాక్సర్​పై పంచ్​లు కురిపించిన సతీశ్​ కుమార్​
క్వార్టర్స్​లో ఉజ్బెకిస్థాన్​ బాక్సర్​, టాప్​ సీడ్​ జలలోవ్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు భారత సూపర్​ హెవీవెయిట్​ బాక్సర్​

మళ్లీ ఆశలు పెంచుతున్న మను బాకర్​

షూటింగ్​ మహిళల 25.మీ. పిస్టల్​ విభాగం క్వాలిఫికేషన్​ స్టేజీ 1లో ఐదో స్థానంలో నిలిచి పతకంపై ఆశలు రేపుతున్న షూటర్​ మను బాకర్​

ఒలింపిక్స్​ నుంచి మేరీకోమ్​ ఔట్​..

కొలంబియా బాక్సర్​ వాలెన్సియా చేతిలోొ​.. ప్రీక్వార్టర్స్​లో ఓడిపోయింది.

ఇవీ చూడండి:

ఒలింపిక్స్​లో స్వర్ణం సాధిస్తే రూ.3 కోట్ల నజరానా

సింధు, మను, అతాను జోరు- హాకీ, బాక్సింగ్​లో క్వార్టర్స్​కు..

Last Updated : Jul 29, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details