టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్కు కోటి రూపాయిలు అందించారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అసోంకు చెందిన 'లవ్లీనా'కు గువాహటిలో గురువారం సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా.. ఆమెకు పోలీసు శాఖలో డీఎస్పీ పదవి ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం.
ఆమె స్వగ్రామం గోలాఘట్లో లవ్లీనా పేరుతో ఓ స్టేడియం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. గువాహటిలోని ఓ రోడ్డుకూ లవ్లీనా పేరు పెట్టనున్నట్లు కూడా ప్రకటించారు. ఆమెకు శిక్షణనిచ్చిన నలుగురు కోచ్‌లకూ రూ. 10 లక్షల చొప్పున అందించారు.
సీఎం స్వయంగా వెళ్లి..
ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత తొలిసారి గువాహటి చేరుకున్న లవ్లీనాకు అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రే స్వయంగా విమానాశ్రాయనికి వెళ్లి ఆమెకు ఆహ్వానం పలకడం విశేషం. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఆమెను నగరానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో లవ్లీనాను ఘనంగా సన్మానించారు. ఆమె గ్రామం ఉండే నియోజకవర్గంలో సారుపతర్‌లో బాక్సింగ్ అకాడమీతో పాటు ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడతామన్నారు.