తెలంగాణ

telangana

ETV Bharat / sports

Tokyo Olympics: రికార్డు స్థాయి కేసులు.. నిరాటంకంగా క్రీడలు! - టోక్యో ఒలింపిక్స్​

టోక్యోలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో తొలిసారి 4వేలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. క్రీడాగ్రామంలో 21 మందికి కరోనా సోకింది. అయినప్పటికీ.. ఒలింపిక్ క్రీడలు నిరాటంకంగానే సాగుతున్నాయి.

corona cases in tokyo
టోక్యో ఒలింపిక్స్​

By

Published : Aug 1, 2021, 6:43 AM IST

డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది. ఒలింపిక్ నగరం టోక్యోలో రికార్డు స్థాయి కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 4,058 కొత్త కేసులు వెలుగుచూశాయి. జపాన్ రాజధానిలో నాలుగువేలకు పైగా కేసులు బయటపడటం ఇదే మొదటిసారి. అలాగే దేశంలో వరుసగా రెండోరోజు 10వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. మరోపక్క క్రీడాగ్రామంలో 21 మందికి కరోనా సోకింది. అక్కడ జులై 1 నుంచి ఇప్పటివరకు 241 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే టోక్యోలో 'అత్యవసర పరిస్థితి' ఉండగా.. జపాన్ ప్రభుత్వం మరో 4 నాలుగు ప్రాంతాలకు ఆంక్షలను విస్తరించింది.

టోక్యో నగరాన్ని కరోనా వణికిస్తున్నప్పటికీ.. ఒలింపిక్ క్రీడలు నిరాటంకంగా సాగుతున్నాయి. 21 స్వర్ణాలతో సహా మొత్తం 45 పతకాలతో చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ రెండు, అమెరికా మూడో స్థానంలో ఉన్నాయి. భారత్‌ మాత్రం మిశ్రమ ఫలితాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రూపంలో ఒక రజత పతకం భారత్ సొంతమైంది.

బాక్సర్​ లవ్లీనా బోర్గోహైన్​ మరో పతకం ఖాయం చేసింది.

మలేసియా, థాయిలాండ్‌లో 'డెల్టా' విజృంభణ..

మలేసియా, థాయిలాండ్‌లో రికార్డు స్థాయిలో వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మలేసియాలో 17,786 మందికి కరోనా సోకగా.. థాయిలాండ్‌లో 18,912 మందికి పాజిటివ్‌గా తేలింది. నలుపు జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ మలేసియన్లు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నారు. కొద్దినెలలుగా విఫల ప్రభుత్వం పేరిట హ్యాష్ ట్యాగ్‌ అక్కడ ట్రెండ్ అవుతోంది. థాయిలాండ్‌లో 60 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అమెరికా, చైనాలో కూడా ఈ వేరియంట్ ఉగ్రరూపం చూపిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:మానసిక క్షోభకు గురిచేశారు: మేరీకోమ్​

ABOUT THE AUTHOR

...view details