ప్రపంచ టెన్నిస్ నంబరు.1 ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఫ్రెంచ్ ఓపెన్(French Open) విజేతగా నిలిచాడు. ఫైనల్లో గెలిచిన ఆనందంలో తన టెన్నిస్ రాకెట్‌ను ఓ చిన్నారి అభిమానికి బహుమతిగా అందించాడు. ఆ వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్‌గా మారింది.
జకోవిచ్ రాకెట్‌ను అందుకున్న ఆ చిన్నారి అభిమాని అనందానికి అవధులు లేవు. అయితే తన టెన్నిస్ రాకెట్‌ను ఆ చిన్నారి ఎందుకు ఇచ్చారనే దానికి మ్యాచ్ అనంతరం జకోవిచ్ మాట్లాడాడు. తొలి రెండు సెట్లలో తాను ఓడినా తనకు మద్దతుగా నిలిచాడని.. తన టెన్నిస్ రాకెట్ ఇవ్వడానికి అంతకంటే బెస్ట్ అభిమాని ఎవరుంటారని జకోవిచ్ అన్నాడు.