ప్రముఖ అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి స్లోనే స్టీఫెన్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆల్టిడోర్ త్వరలో రింగులు మార్చుకోనున్నారు. చిన్ననాటి నుంచే స్నేహితులైన వీరిద్దరూ 2016 నుంచి డేటింగ్లో ఉన్నారు. తాజాగా నిశ్చితార్దం చేసుకున్నట్లు సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు.
స్టార్ జంటకు మ్యాచింగ్ కుదిరింది - Sloane Stephens - a six-time WTA Tour winner - and United States international Jozy Altidore are engaged.
అమెరికన్ టెన్నిస్ స్టార్ స్లోనే స్టీఫెన్స్, ఫుట్‌బాల్ ఆటగాడు ఆల్టిడోర్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఇద్దరూ నిశ్చితార్దం చేసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
![స్టార్ జంటకు మ్యాచింగ్ కుదిరింది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3145780-thumbnail-3x2-slonealex.jpg)
లవ్ మ్యాచింగ్ కుదిరింది
ఇద్దరూ ఛాంపియన్స్..
- 2017లో అమెరికా ఓపెన్‌లో ఛాంపియన్‌గా అవతరించించింది స్టీఫెన్స్. 6 వరల్డ్ టూర్ టైటిల్స్ సహా గతేడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2017లో యూఎస్ ఫెడ్‌కప్ జట్టులోనూ సభ్యురాలిగా ఉంది. 2018 వరల్డ్ టూర్లో ఫైనల్స్ వరకు వెళ్లింది.
- 29 ఏళ్ల అల్టిడోర్ ప్రస్తుతం టొరంటో తరఫున సాకర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఇతడు రెండు ప్రపంచకప్‌లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అమెరికా జట్టు ఆడే అన్ని ప్రధాన టోర్నీలలో ఇతడికి స్థానం ఉంటుంది. 2007లో అరంగేట్రం చేసిన అల్టిడోర్....110 మ్యాచ్‌లాడి 41 గోల్స్ సాధించాడు. 100 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన అమెరికన్ ఆటగాళ్ల జాబితాలో 17వ స్థానం సంపాదించాడు.