మళ్లీ పాత పద్ధతిలోనే 52 వారాల విధానం ప్రకారం మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌ను నిర్ణయించే దిశగా డబ్ల్యూటీఏ సిద్ధమైంది. కరోనా మహమ్మారి కారణంగా నిరుడు మార్చి నుంచి ర్యాంకింగ్స్‌పై స్తబ్ధత కొనసాగింది. ఈ క్లిష్టమైన విధానం ప్రకారం ఏదైనా టోర్నీలో గెలిచిన ర్యాంకింగ్ పాయింట్లు ఆ క్రీడాకారిణి జాబితాలో కనిష్ఠంగా ఏడాది, గరిష్ఠంగా రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది. మియామి ఓపెన్ ముగిసిన తర్వాత వచ్చే నెల 5 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
మళ్లీ పాత విధానంలోనే టెన్నిస్ ర్యాంకింగ్స్ - మళ్లీ పాత విధానంలోనే టెన్నిస్ ర్యాంకింగ్స్
పాత పద్ధతిలోనే మహిళల టెన్నిస్ ర్యాంకింగ్స్‌ను నిర్ణయించే దిశగా డబ్ల్యూటీఏ సిద్ధమైంది. ఈ క్లిష్టమైన విధానం ప్రకారం ఏదైనా టోర్నీలో గెలిచిన ర్యాంకింగ్ పాయింట్లు ఆ క్రీడాకారిణి జాబితాలో కనిష్ఠంగా ఏడాది, గరిష్ఠంగా రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.

ఎవరైనా క్రీడాకారిణి 2019లో ఓ టోర్నీలో ఆడి.. 2020లో మళ్లీ అందులో ఆడకుండా, 2021లో ఆడితే ఆ టోర్నీ ర్యాంకింగ్స్ పాయింట్లు ఆమె ఖాతా నుంచి కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఆ పాయింట్లను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈ విధానాన్ని తిరిగి అమలు చేసేముందు 2019 మార్చి నుంచి ఆడిన వాటిల్లో టాప్-16 టోర్నీల ఫలితాల ప్రకారం ర్యాంకింగ్ పాయింట్లను ఎంచుకునే అవకాశాన్ని క్రీడాకారిణులకు డబ్ల్యూటీఏ కల్పిస్తోంది. దీంతో 2020లో టోర్నీలకు దూరంగా ఉన్న ప్రపంచ నంబర్‌వన్ ఆష్లీ బార్టీ లాంటి ప్లేయర్లకు ఈ అవకాశం కలిసి రానుంది.
ఉదాహరణకు 2019లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన బార్టీ.. నిరుడు దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అయినప్పటికీ 2019లో విజేతగా నిలిచినప్పుడు వచ్చిన ర్యాంకింగ్ పాయింట్లను కొనసాగించుకునే అవకాశం ఉంది.