వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది ఆస్ట్రేలియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకున్న బార్టీ.. తాజాగా రెండో ట్రోఫీని ముద్దాడింది. టెన్నిస్‌లో నంబర్‌వన్‌గా ఉన్న బార్టీ.. గతంలో క్రికెటర్‌గానూ కొనసాగిందనే విషయం తెలుసా?
ఆస్ట్రేలియాకు చెందిన బార్టీ 2014లో టెన్నిస్ నుంచి తప్పుకుంది. కొంతకాలం క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఈ క్రమంలో 2015లో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు ఆడింది. అదే ఏడాది నవంబర్‌లో క్వీన్‌లాండ్స్ జట్టు తరఫున కూడా రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడింది బార్టీ. మళ్లీ 2016లో రాకెట్ చేత బట్టి కోర్టులోకి దిగింది.