గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ను మరువక ముందే మరో టెన్నిస్ సమరం జరగనుంది. లండన్ వేదికగా నేటి నుంచి పచ్చికపై రాకెట్లతో రెచ్చిపోనున్నారు క్రీడాకారులు. వింబుల్డన్ రారాజు రోజర్ ఫెదరర్‌తో పాటు నొవాక్ జకోవిచ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టైటిల్ రేసులో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో సెరెనా, క్విటోవా, ఒసాకా, కెర్బర్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నారు.
ఫేవరెట్ టైటిల్ నెగ్గుతాడా..
అత్యధిక వింబుల్డన్ టైటిళ్లు నెగ్గిన ఫెదరర్(8) మరోసారి ఈ పురాతన టెన్నిస్ ట్రోఫీపై కన్నేశాడు. ఈ టోర్నీలో సెమీస్ వరకు ఫెదరర్‌కు ఎదురుండకపోవచ్చు. రోజర్‌కు ఈ టోర్నీలో సులభమైన డ్రానే పడింది. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి నాదల్‌తో తలపడే అవకాశముంది. ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో రఫెల్ చేతిలో పరాజయం చెందాడు ఫెదరర్.
ఫ్రెంచ్ ఓపెన్ జోరు వింబుల్డ్న్లో కొనసాగిస్తాడా..
ఎర్రమట్టికోర్టులో ఎదురులేని నాదల్... వింబుల్డన్‌లో సత్తాచాటాలనుకుంటున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఫెదరర్‌ను ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ఓడించి 12వ సారి టైటిల్ నెగ్గాడు. అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. వింబుల్డన్ తొలి రౌండ్లో జాపాన్ క్రీడాకారుడు సుగిటాతో తలపడనున్నాడు.
నొవాక్ రాణిస్తాడా..