ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్లో దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్సన్‌పై 6-3, 6-3, 6-3 తేడాతో విజయం సాధించాడు.
తొలి సెట్లో జకోవిచ్ గెలుపొందినప్పటికీ.. రెండో సెట్లో ప్రత్యర్థి పుంజుకున్నాడు. 2-1 ఆధిక్యంలోకి వెళ్లాడు. తిరిగి గేమ్‌పై పట్టు సాధించిన ఈ సెర్బియా స్టార్ 6-3తో సెట్‌ను ముగించాడు.