లండన్ వేదికగా ప్రారంభమైన వింబుల్డన్ ఓపెన్‌లో(Wimbledon) ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. వైల్డ్ కార్డ్ ద్వారా టోర్నీలోకి ప్రవేశించిన బ్రిటిష్ ఆటగాడు జాక్ డ్రాపర్పై తొలి రౌండ్లో 4-6, 6-1, 6-2, 6-2తో విజయం సాధించాడు. గేమ్ తొలి సెట్‌ను 4-6 తేడాతో కోల్పోయిన ఈ సెర్బియా స్టార్ తర్వాత మూడు సెట్లను గెలుపొందాడు.
జకోవిచ్ తన తర్వాతి రౌండ్లో ఐదో సీడ్ ఆటగాడు కెవిన్ అండర్సన్‌తో తలపడనున్నాడు. చివరిసారిగా 2019లో వింబుల్డన్ జరిగింది. కొవిడ్ కారణంగా గతేడాది ఈ టోర్నీ జరగలేదు. రెండేళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక ఓపెన్ తిరిగి ప్రారంభం కావడం వల్ల అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు.