తెలంగాణ

telangana

ETV Bharat / sports

అగ్రస్థానం నిలబెట్టుకున్న జకో, ఆష్లే బార్టీ - rafel nadal

తాజా టెన్నిస్ ర్యాంకింగ్స్​లో జకోవిచ్, ఆష్లే బార్టీ అగ్రస్థానాలు నిలుపుకున్నారు. పురుషుల విభాగంలో నాదల్, ఫెదరర్.. రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వింబుల్డన్ ఫైనల్లో గెలిచిన సిమోనా హలెప్ నాలుగో ర్యాంకులో నిలిచింది.

టెన్నిస్

By

Published : Jul 15, 2019, 5:55 PM IST

ఆదివారంతో వింబుల్డన్ టోర్నీ పూర్తయింది. తాజాగా క్రీడాకారులకు ర్యాంకింగ్స్ ప్రకటించింది టెన్నిస్ అసోసియేషన్(ఏటీపీ). ఈ ర్యాంకింగ్స్​లో వింబుల్డన్ విజేత నొవాక్ జకోవిచ్(సెర్బియా) అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్​లో ఓడినప్పటికీ మహిళల విభాగంలో తన ర్యాంక్​ను పదిలపరచుకుంది ఆష్లీ బార్టీ(ఆస్ట్రేలియా).

పురుషుల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న జకో 12,415 పాయింట్లతో కొనసాగుతున్నాడు. తర్వాత రఫెల్​ నాదల్(స్పెయిన్) 7,945 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. స్విస్ దిగ్గజం ఫెదరర్ మూడో స్థానంలో నిలిచాడు. వింబుల్డన్ సెమీస్​లో జకో చేతిలో కంగుతిన్న రాబర్టో బటిస్టా(స్పెయిన్) 9 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు.

టాప్ - 5లో నిలిచిన ఆటగాళ్లు..

  • నొవాక్ జకోవిచ్(సెర్బియా) - 12,415 పాయింట్లు
  • రఫెల్ నాదల్(స్పెయిన్)- 7,945 పాయింట్లు
  • రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) - 7,460 పాయింట్లు
  • డొమినిక్ థీమ్(ఆస్ట్రియా) - 4,595 పాయింట్లు
  • అలెగ్జాండర్ జ్వెరేవ్​(జర్మనీ) - 4,325 పాయింట్లు

మహిళల విభాగంలో ఆష్లే బార్టీ 6,605 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నొవామీ ఒసాకా(జపాన్) రెండో స్థానంలో ఉంది. వింబుల్డన్​ ఫైనల్​లో సెరెనాను ఓడించిన సిమోనా హలెప్ నాలుగో స్థానానికి చేరింది. సెరెనా ఒక్క స్థానం మెరుగుపర్చుకొని 9వ ర్యాంకులో నిలిచింది.

టాప్ - 5లో నిలిచిన క్రీడాకారిణిలు..

  • ఆష్లే బార్టీ( ఆస్ట్రేలియా) - 6,605 పాయింట్లు
  • నొవామి ఒసాకా(జపాన్) - 6,257 పాయింట్లు
  • కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) - 6,055 పాయింట్లు
  • సిమోనా హలెప్ (రొమేనియా) - 5,933 పాయింట్లు
  • కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్​) - 5,130 పాయింట్లు

ఇది చదవండి: WC19: ఐసీసీ ప్రపంచకప్​ జట్టు ఇదే...!

ABOUT THE AUTHOR

...view details