మహిళల డబుల్స్ జోడీ అంకితా రైనా(ఇండియా)-లారెన్ డేవిస్(అమెరికా).. వింబుల్డన్ ఓపెన్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ టోర్నీలో తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న రైనాకు నిరాశే ఎదురైంది. యూఎస్ డబుల్స్ జంట అసియా మహమ్మద్-జెస్సికా పెగులా.. వరుస సెట్లలో ఈ ద్వయాన్ని ఓడించింది. గంటా పది నిమిషాల పాటు జరిగిన పోరులో అంకిత-డేవిస్ ద్వయం 6-3, 6-2 తేడాతో ఓటమి పాలైంది.
మిక్స్డ్ డబుల్స్ రూపంలో అంకితకు మరో అవకాశం ఉంది. భారత జోడీ సానియా మీర్జా-రోహన్ బోపన్నపై అంకిత-రామ్‌కుమార్ రామనాథన్ జంట శుక్రవారం పోటీ పడనుంది.