స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. వింబుల్డన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఓపెన్ యుగంలో క్వార్టర్స్‌కు చేరుకున్న అతిపెద్ద వయస్కుడిగా సరికొత్త రికార్డు సాధించాడు. ఇటలీ ప్లేయర్ లోరెన్ సొనెగోతో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 7-5, 6-4, 6-2 తేడాతో గెలిచి ఈ ఘనత సాధించాడు.
ఈ గెలుపుతో వింబుల్డన్ ఓపెన్‌లో 18వ సారి క్వార్టర్స్‌కు చేరాడు రోజర్. మొత్తంగా 2 గంటల 11 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఫెదరర్‌కు ప్రత్యర్థి నుంచి మొదట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్లో 5-5తో ఇరువురు సమానంగా ఉన్నప్పుడు వర్షం ప్రారంభమైంది. దీంతో కొద్దిసేపు ఆటకు విరామం ప్రకటించారు. అనంతరం కోర్టులోకి దిగిన స్విస్ ఆటగాడు.. వెనక్కి తిరిగి చూడలేదు. పాత ఫెదరర్‌ను గుర్తుకు తెచ్చాడు. తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటి చెప్పాడు. చివరి రెండు సెట్లు పూర్తి నియంత్రణతో ఆడాడు.