తెలంగాణ

telangana

ETV Bharat / sports

వింబుల్డన్​ ఫైనల్​: ఫెదరర్​ X జకోవిచ్​

ప్రతిష్టాత్మక టెన్నిస్​ టోర్నీ వింబుల్డన్​ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు స్విస్​ దిగ్గజం ఫెదరర్​, సెర్బియా స్టార్​ జకోవిచ్​. పురుషుల సింగిల్స్​ విజేతగా అవతరించేందుకు ఇద్దరూ నేడు పోటీ పడనున్నారు. వీరిద్దరి మధ్య పోరు సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు స్టార్​స్పోర్ట్స్​లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

వింబుల్డన్​ ఫైనల్​: ఫెదరర్​X జకోవిచ్​

By

Published : Jul 14, 2019, 9:27 AM IST

వింబుల్డన్​ పురుషుల టైటిల్​ కోసం నేడు కీలక సమరం జరగనుంది. తుది పోరులో ప్రపంచ నెం.1 జకోవిచ్​, స్విస్​ దిగ్గజం రోజర్​ ఫెదరర్​ తలపడనున్నారు.

ఫెదరర్​ 12...

37 ఏళ్ల ఫెదరర్‌ పన్నెండో సారి ఫైనల్‌కు చేరాడు. ఇప్పటివరకు 8 సార్లు(2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017) టైటిల్‌ నెగ్గి మూడుసార్లు రన్నరప్‌గా నిలిచాడీ స్విస్​ స్టార్​. ఒక గ్రాండ్​ స్లామ్​ ఫైనల్లో ఆడుతున్న మూడో పెద్ద వయస్కుడు.

జకోవిచ్​ 6..

32 ఏళ్ల జకోవిచ్‌ ఆరోసారి ఫైనల్​కు చేరాడు. వింబుల్డన్‌ ట్రోఫీని నాలుగుసార్లు (2011, 2014, 2015, 2018) సొంతం చేసుకున్న ఈ సెర్బియా వీరుడు... ఒకసారి రన్నరప్‌గా నిలిచాడు.

నువ్వా-నేనా...

ఫెదరర్​, జకోవిచ్​ కెరీర్​లో ఇప్పటి వరకు 47 సార్లు తలపడగా నొవాక్​ 25, ఫెదరర్​ 22 మ్యాచ్​లు గెలిచారు. వీళ్లిద్దరు తలపడిన గత 20 మ్యాచ్​ల్లో జోకోవిచే 14 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details