తెలంగాణ

telangana

ETV Bharat / sports

అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్​గా ఒసాకా - ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారిణి

ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్​గా జపాన్​ టెన్నిస్​ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. నాలుగేళ్లుగా తొలిస్థానంలో కొనసాగుతున్న సెరెనా విలియమ్స్​ను వెనక్కినెట్టి తొలిసారిగా ఆ స్థానంలోకి చేరింది ఒసాకా. ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే తొలి 100 మందిలో 29వ స్థానంలో నిలిచింది.

Tennis star Naomi Osaka tops Serena Williams as world's highest-earning female athlete
అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళాగా అథ్లెట్​ ఒసాకా

By

Published : May 23, 2020, 4:51 PM IST

ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా జపాన్‌కు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. దీంతో అమెరికన్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను ఆమె వెనక్కినెట్టి తొలిస్థానానికి చేరింది. గత పన్నెండు నెలల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రకటించిన జాబితాలో రూ.284.15 కోట్లతో (37.4 మిలియన్‌ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచిందీ జపాన్ క్రీడాకారిణి. ఎండార్సుమెంట్లు, ప్రైజ్‌మనీ రూపంలో సెరెనా కంటే రూ.10.64 కోట్లు (1.4 మిలియన్‌ డాలర్లు) ఎక్కువగా సంపాదించింది. నాలుగేళ్లుగా టాప్​లో కొనసాగుతున్న సెరెనా విలియమ్స్​కు చెక్ పెట్టింది.

ఒసాకా ఇప్పటివరకు రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలుపొందింది. ఇప్పటివరకు రష్యా క్రీడాకారిణి షరపోవా పేరుతో ఉన్న రికార్డును ఆమె అధిగమించింది. షరపోవా 2015లో 29.7 మిలియన్‌ డాలర్లు సంపాదించింది.

నవోమి ఒసాకా

ప్రపంచవ్యాప్తంగా 29వ స్థానం

ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న 100 మంది అథ్లెట్లతో ఫోర్బ్స్‌ రూపొందించిన జాబితాలో ఒసాకా 29వ స్థానంలో నిలిచింది. 23 గ్రాండ్​ స్లామ్​ టైటిల్స్​ గెలుచుకున్న సెరెనా విలియమ్స్​ కంటే నాలుగు స్థానాలు మెరుగ్గా ఉంది. సెరెనా వార్షిక ఆదాయం రూ.136 కోట్ల నుంచి రూ.220 కోట్ల వరకు ఉంది.

ఇదీ చూడండి..'క్రికెట్​కు నేను ఎంతగానో రుణపడి ఉంటా'

ABOUT THE AUTHOR

...view details