13 నెలల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ తిరిగి కోర్టులోకి అడుగుపెట్టనున్నాడు. ఖతార్ ఓపెన్‌లో భాగంగా తన రెండో రౌండ్లో బ్రిటన్ ప్లేయర్ డానియల్ ఇవాన్స్‌తో తలపడనున్నాడు ఫెదరర్.
గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా గాయపడిన ఫెదరర్.. తన కుడి మోకాలికి రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. దోహ ఖతార్ ఓపెన్‌ను ఇది వరకు మూడు సార్లు కైవసం చేసుకున్నాడు ఈ స్విస్ దిగ్గజం.