మెక్సికన్ ఓపెన్లో భూకంపం ప్రేక్షకుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అలెగ్జాండర్ జ్వెరెవ్, డొమినిక్ కోఫర్ తలపడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు ప్రకంపనలు వస్తోన్న ఆటను మాత్రం ఆపలేదు వీరిద్దరూ.
భూకంపం వస్తే ఏంటి.. మాకు ఆటే ముఖ్యం! - Dominik Koepfer
మెక్సికన్ ఓపెన్లో జ్వెరెవ్-కోఫర్ తలపడుతోన్న సమయంలో స్టేడియంలో భూకంపం వచ్చింది. అయినా వారిద్దరూ ఆటను కొనసాగించారు.

మెక్సికన్ ఓపెన్
భూకంపం దృశ్యాలు
కోఫర్ రెండో సెట్లో సర్వ్ చేస్తున్న సమయంలో భూమి కంపించింది. టెలివిజన్ కెమెరాలు కూడా షేక్ అయ్యాయి. కానీ జ్వెరెవ్, కోఫర్ మాత్రం పాయింట్ సాధించే వరకు వారి ఆటను కొనసాగించారు. ఈ మ్యాచ్లో జ్వెరెవ్ 6-4, 7-6(5)తేడాతో ప్రత్యర్థి కోఫర్ను ఓడించాడు. తద్వారా టోర్నీలో ఫైనల్కు చేరుకున్నాడు.