తెలంగాణ

telangana

డేవిస్​ కప్​ వేదిక మార్చాల్సిందే: మహేశ్​ భూపతి

By

Published : Oct 15, 2019, 5:36 PM IST

పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​ వేదికగా జరగాల్సిన డేవిస్​కప్​ టోర్నీ వేదికను మార్చాలని మరోసారి కోరాడు భారత టెన్నిస్​ ప్లేయర్​ మహేశ్​ భూపతి. దీనిపై అంతర్జాతీయ టెన్నిస్​ ఫెడరేషన్​(ఐటీఎఫ్​) నిర్ణయం కోసం వచ్చే నెల 4 వరకు వేచి చూస్తామని చెప్పాడు. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకోవాలని ఐటీఎఫ్​కు విజ్ఞప్తి చేశాడీ ఆటగాడు.

'డెవిస్​ కప్​ వేదిక మార్పు కోసమే ఎదురుచూపులు'

ప్రతిష్టాత్మక డేవిస్​కప్​ టోర్నీ వేదిక మార్పుపై నవంబరు 4 వరకు వేచి చూస్తామని చెప్పాడు భారత టెన్నిస్​ క్రీడాకారుడు మహేశ్​ భూపతి. పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​ వేదికగా జరగాల్సిన మ్యాచ్​లకు భద్రత అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో దాయాది దేశం వెళ్లేందుకు బృందం తరఫున మరోసారి నిరాసక్తత వ్యక్తం చేశాడు. ఇప్పటికే వేదిక మార్చాలని అంతర్జాతీయ టెన్నిస్​ ఫెడరేషన్​(ఐటీఎఫ్​)కు లేఖ రాయగా.. దీనిపై స్పందన రావాల్సి ఉంది.

పాకిస్థాన్​కు వెళ్లమని చెప్పేసిన భారత ఆటగాళ్ల బృందం

మరోసారి డ్రా...

భారత్​-పాక్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ.. వేదిక మార్పుపై పునఃసమీక్షించాలని కోరారు ఆటగాళ్లు. గతంలో ఈ మ్యాచ్​లను సెప్టెంబర్​ 14, 15 తేదీల్లో నిర్వహించాలని అనుకున్నా.. భారత టెన్నిస్​ సంఘం ఫిర్యాదుతో తేదీ మార్చారు. తర్వాతి డ్రా నవంబర్ ​29, 30 లేదా డిసెంబర్​ 1న ఇస్లామాబాద్​లో తీయనున్నారు.

డెవిస్​ కప్​

గతంలో వేదిక మార్చాలని భారత టెన్నిస్​ సంఘం కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించింది ఐటీఎఫ్​. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తే ఆడేందుకు మహేశ్​ భూపతి సారథ్యంలో ఇప్పటికే ఆరుగురు ఆటగాళ్ల జట్టు సిద్ధంగా ఉంది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details