ఒకవైపు టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొడుతూ.. అదే సమయంలో హులా హూప్స్ (శరీరంతో రింగును తిప్పడం) చేస్తూ అబ్బురపరుస్తోంది ఓ బాలిక. సంబంధిత వీడియోను ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యూటీఏ) గురువారం ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
వైరల్: టెన్నిస్ బ్యాట్‌తో ఆడుతూనే హులా హూప్స్ - Tennis and Hula Hoops
ఒకవైపు టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొడుతూ.. అదే సమయంలో హులా హూప్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది ఓ బాలిక. ఆమె నైపుణ్యాలను చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
టెన్నిస్
టెన్నిస్‌లో చూపులు, చేతుల మధ్య సమన్వయం కీలకం. దీంతోపాటు శరీరాన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. వీడియోలోని బాలిక కుడిచేతితో టెన్నిస్ రాకెట్ పట్టుకుని బంతితో ఆడుతూనే.. మరోవైపు హులా హూప్స్ చేయడం ఆకట్టుకుంటోంది. "రెండు పనులను ఒకేసారి చేయడానికి ఏకాగ్రత, నిరంతర అభ్యాసం, సహనం అవసరం. ఆమె నైపుణ్యాలు ప్రశంసనీయం" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.