తెలంగాణ

telangana

ETV Bharat / sports

నవోమి ఒసాకా.. వివక్షను ఎదిరిస్తున్న రాకెట్‌

నవోమి ఒసాకా... ఆటతోపాటు మాటతోనూ తన ఉనికిని చాటుతోంది. యు.ఎస్‌. ఓపెన్‌-2020 విజేతగా నిలిచిన నవోమి... టోర్నీ ఆద్యంతం జాతి వివక్ష గురించి గొంతెత్తింది. ఈ విజేత గురించి ఆసక్తికరమైన విషయాలు...

u.s. tennis star Naomi Osaka  against racism
నవోమి ఒసాకా.. వివక్షను ఎదిరిస్తున్న రాకెట్‌

By

Published : Sep 15, 2020, 3:23 PM IST

జపాన్‌ నుంచి అమెరికాకు...

నవోమి తండ్రి లియానార్డ్‌ ఫ్రాంకోసిస్‌ది హైతీ. తల్లి తమాకీ ఒసాకాది జపాన్‌. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి మారీ, రెండో అమ్మాయి నవోమీ. నవోమీకి మూడేళ్లపుడు వీరి కుటుంబం జపాన్‌ నుంచి అమెరికా వలస వచ్చింది.

విలియమ్స్‌ సిస్టర్స్‌ స్ఫూర్తి...

విలియమ్స్‌ సిస్టర్స్‌ని స్ఫూర్తిగా తీసుకున్న ఫ్రాంకోసిస్‌... తన కుమార్తెలకు టెన్నిస్‌లో ఓనమాలు నేర్పించాడు. నవోమి అక్క మారీ కూడా టెన్నిస్‌ క్రీడాకారిణి. ఇద్దరూ డబుల్స్‌ ఆడతారు.

అమెరికా పౌరసత్వం వదిలి...

తమ పిల్లలు జపాన్‌లో పుట్టడంవల్ల వారికి ఆ దేశ సంస్కృతి అలవాటైందనీ అందుకే అమెరికా పౌరసత్వం వదిలి జపాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారనీ చెబుతారు ఫ్రాంకోసిస్‌. ‘జపాన్‌ సంస్కృతి నాకు ఎంతో నచ్చుతుంది. హైతీ వాసులూ ఎంతో స్నేహ స్వభావంతో ఉంటారు. మా పూర్వీకులు గుర్తొచ్చిన ప్రతిసారీ ఓడిపోకూడదనుకుంటా’...అంటుంది నవోమి.

జాతి వివక్షకు వ్యతిరేకంగా... గొంతెత్తడం ద్వారా దిగ్గజ ఆటగాళ్లు మహ్మదాలీ, జెస్సీ ఒవెన్స్‌లను గుర్తుచేస్తోంది. యు.ఎస్‌. ఓపెన్లో మ్యాచ్‌కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించినవారి పేర్లుండే ఏడు మాస్కులు ధరించింది. తద్వారా జాతి వివక్ష గురించి అందరూ చర్చించుకునేలా చేసింది.

ABOUT THE AUTHOR

...view details