వింబుల్డన్‌లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ ఆష్లే బార్టిని ఓడించిన అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి ఆలిసన్ రిస్కే వివాహం చేసుకుంది. తన స్నేహితుడు స్టీఫెన్ అమృతరాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా సంగీత్‌లో బాలీవుడ్ పాటకు నర్తించింది ఆలిసన్.
2016లో విడుదలైన బార్ బార్ దేఖో ప్యార్ చిత్రంలోని నచదే రే సారి పాటకు లయబద్దంగా చిందేసింది. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సాంగ్‌కు దుమ్మురేపుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోను చూసి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ట్వీట్ చేసింది.