కరోనా వైరస్ ముప్పుతో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ టెన్నిస్ సంఘం, ఏటీపీ, డబ్లూటీఏ నిర్వాహకులను సంప్రదించిన తర్వాతే కొత్త షెడ్యూల్‌ను నిర్ణయిస్తామని అమెరికా టెన్నిస్ సంఘం వెల్లడించింది.
'ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకోవద్దని మేం గుర్తించాం' అని యూఎస్‌టీఏ తెలిపింది. ఇప్పటికే కొవిడ్-19 ప్రభావంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ వాయిదా వేశారు. మే 24- జూన్ 7 మధ్య జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 మధ్య జరపాలని నిర్ణయించారు. యూఎస్ ఓపెన్‌ను ఆగస్టు 23- సెప్టెంబర్ 13 వరకు నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ యూఎస్ ఓపెన్ వాయిదా పడకపోతే రెండు టోర్నీల మధ్య ఉండే అంతరం కేవలం వారం రోజులే అవుతుంది.