సుమిత్ నగల్ (190వ ర్యాంకు).. భారత యువ టెన్నిస్ ఆటగాడు. యూఎస్ ఓపెన్‌లో పాల్గొననున్న అతి పిన్న భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. క్వాలిఫయిర్ మ్యాచ్ చివరి పోరులో బ్రెజిల్ ఆటగాడు మెనిజెస్ను 5-7, 6-4, 6-3 తేడాతో ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించాడు. సుమిత్ వయసు 22 ఏళ్లు.
2015లో వింబుల్డన్ జూనియర్ డబుల్స్ టైటిల్ నెగ్గిన సుమిత్.. తాజాగా యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. తొలి పోరులో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.