తెలంగాణ

telangana

ETV Bharat / sports

Us Open: జకో మరో అడుగు.. ప్రీక్వార్టర్స్​కు హలెప్​ - యూఎస్​ ఓపెన్​ నొవాక్​ జకోవిచ్​

యూఎస్​ ఓపెన్​లో(US Open) పలువురు స్టార్​ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ రెండో రౌండ్​లో నెగ్గాడు. మహిళల సింగిల్స్​లో సిమోనా హలెప్‌(రొమేనియా) ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

us open
యూఎస్​ ఓపెన్​

By

Published : Sep 4, 2021, 6:39 AM IST

రొమేనియా స్టార్‌ సిమోనా హలెప్‌ యుఎస్‌ ఓపెన్లో(us open halep 2021) ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో ఈ పన్నెండో సీడ్‌ 7-6 (13/11), 4-6, 6-3తో రెబకీనా (కజికిస్థాన్‌)ను ఓడించింది. టైబ్రేకర్‌కు వెళ్లిన తొలి సెట్‌ను కష్టం మీద దక్కించుకున్న హలెప్‌.. రెండో సెట్‌ను కోల్పోయింది. అయితే మూడో సెట్లో రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సిమోనా విజయాన్ని అందుకుంది.

కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) కూడా గట్టెక్కింది. రెండో రౌండ్‌ దాటడానికి ఈ నాలుగో సీడ్‌ చాలా కష్టపడింది. రెండో రౌండ్లో ప్లిస్కోవా 7-5, 6-7 (5/7), 7-6 (9/7)తో అన్‌సీడెడ్‌ అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. కెర్బర్‌ (జర్మనీ), క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆండ్రెస్క్యూ (కెనడా), స్వైటెక్‌ (పోలెండ్‌) మూడో రౌండ్‌ చేరారు.

జకో మరో అడుగు

21వ టైటిల్‌పై గురి పెట్టిన సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌(us open novak djokovic) ఆ దిశగా మరో అడుగు వేశాడు. అతడు తేలిగ్గానే రెండో రౌండ్‌ దాటాడు. ఈ టాప్‌ సీడ్‌ జకో 6-2, 6-3, 6-2తో గ్రిక్స్‌పూర్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడు. రెండో సెట్లో ఒకసారి జకో సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆశ్చర్యపరిచిన గ్రిక్స్‌పూర్‌.. ఆ తర్వాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు. ఈ పోరులో 13 ఏస్‌లు సంధించిన జకో.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. నాలుగో సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆరో సీడ్‌ బెరిటిని, ఏడో సీడ్‌ షపొవలోవ్‌ (కెనడా) కూడా ముందంజ వేశారు. జ్వెరెవ్‌ 6-1, 6-0, 6-3తో రమోస్‌ (స్పెయిన్‌)పై గెలవగా.. బెరిటిని 7-6 (7/2), 4-6, 6-4, 6-3తో మోటెట్‌ (ఫ్రాన్స్‌)పై, షపొవలోవ్‌ 7-6 (9/7), 6-3, 6-0తో కార్‌బలాస్‌ (స్పెయిన్‌)పై గెలిచారు.

ఇదీ చూడండి:US Open 2021: మూడో రౌండ్లో బార్టీ- టైటిల్‌పై గురి!

ABOUT THE AUTHOR

...view details