తెలంగాణ

telangana

ETV Bharat / sports

తుపాకీలా టెన్నిస్ రాకెట్​తో స్టిల్- ఆటగాడికి భారీ ఫైన్ - Bryan

యూఎస్​ ఓపెన్​లో అమెరికన్ టెన్నిస్ ఆటగాడు బ్రయాన్​కు 10 వేల డాలర్ల జరిమానా విధించారు. తన రాకెట్​ను తుపాకీ​లా పట్టుకుని న్యాయ నిర్ణేతకు గురిపెట్టినట్లు ఫోజ్ ఇవ్వడమే ఇందుకు కారణం.

బ్రయాన్

By

Published : Sep 2, 2019, 1:10 PM IST

Updated : Sep 29, 2019, 4:06 AM IST

యూఎస్ ఓపెన్​లో అమెరికాకు చెందిన డబుల్స్ ఆటగాడు మైక్ బ్రయాన్..తన రాకెట్​ను తుపాకీ​లా పట్టుకుని రిఫరీ వైపు చూపించిన కారణంగా అతడికి 10 వేల డాలర్ల భారీ జరిమానా పడింది.

బాబ్, బ్రయాన్​ ద్వయం... యూఎస్ ఓపెన్ రెండో రౌండ్​లో రాబర్టో కార్బెల్లెస్-ఫెడెరికో డెల్బోనిస్​పై 4-6, 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో న్యాయ నిర్ణేత నిర్ణయంపై.. బాబ్, బ్రయాన్ సమీక్ష కోరారు. అది కాస్త విజయవంతం కావడం వల్ల రాకెట్​ను గన్​లా పట్టుకుని అతడికి గురిపెట్టినట్లు ఫోజ్ ఇచ్చాడు బ్రయాన్​.ఈ విషయంతో బ్రయాన్​కు 10 వేల డాలర్లు జరిమానా పడింది. ఈ టోర్నీలో ఓ పురుష ఆటగాడికి ఇదే భారీ జరిమానా. అనంతరం ఈ విషయంపై పశ్చాత్తపం వ్యక్తం చేశాడీ ఆటగాడు.

"నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నా. పాయింట్ గెలిచిన ఆనందంలో మాత్రమే అలా చేశా. కొంత కాలంగా సంభవిస్తున్న పరిస్థితులను చూస్తే అది తప్పని అర్థమయింది. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా". -బ్రయాన్, అమెరికా డబుల్స్ ఆటగాడు

టెక్సాస్​లోశనివారం జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఈ ఏడాది యూఎస్​లో పలుమార్లు కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కారణంగా యూఎస్ ఓపెన్​ అధికారులు ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు.

ఇవీ చూడండి.. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగిన జకోవిచ్

Last Updated : Sep 29, 2019, 4:06 AM IST

ABOUT THE AUTHOR

...view details