డిఫెండింగ్ ఛాంపియన్, నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా నాలుగో రౌండ్లో ఆడలేకపోయిన ఈ సెర్బియా స్టార్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
వావ్రింకాతో జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్లో మూడో సెట్ జరుగుతున్న సమయంలో గాయంతో ఇబ్బంది పడ్డాడు జకోవిచ్. అప్పటికే ఈ మ్యాచ్లో 6-4, 7-5, 2-1 తేడాతో వెనుకబడ్డాడు. క్వార్టర్ ఫైనల్లో మెద్వదేవ్తో తలపడనున్నాడు వావ్రింకా.