స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. తొలి రౌండ్లో మిల్మాన్(ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. గతేడాది ఇదే టోర్నీలో రోజర్ ఫెదరర్‌కు మిల్మాన్ షాకివ్వడం వల్ల ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
యూఎస్ ఓపెన్: రెండో రౌండ్ చేరిన నాదల్ - Rafael Nadal
ప్రఖ్యాత గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో రఫేల్ నాదల్ ముందంజ వేశాడు. మెదటి రౌండ్లో ఆస్ట్రేలియా క్రీడాకారుడు జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా)ను ఓడించి రెండో రౌండ్‌కు అర్హత సాధించాడు.
ఆరంభం నుంచే ఆటలో దూకుడు చూపించిన నాదల్... చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. ప్రత్యర్థిని 6-3, 6-3, 6-2 తేడాతో ఓడించాడు. మిల్మాన్కు అస్త్రాలైన ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లను ఆడనివ్వకుండా కట్టడి చేశాడు.
ఇప్పటికే మూడు సార్లు యుఎస్ ఓపెన్ విజేతగా నిలిచాడీ స్పెయిన్ దిగ్గజం. ఆగస్టు 29న జరిగే రెండో రౌండ్లో ఆస్ట్రేలియా ఆటగాడు కొకినాకిస్తో తలపడనున్నాడు నాదల్.
ఈ టోర్నీలోనే మరో మ్యాచ్‌లో టెన్నిస్ దిగ్గజాలు థామస్ ఫాబియానో, డొమినిక్ థీమ్‌లు తలపడ్డారు. ప్రపంచ నెం.4 థీమ్‌కు షాకిస్తూ 6-4, 3-6, 6-3, 6-2 తేడాతో గెలిచాడు ఫాబియనో.