జపాన్ టెన్నిస్ ప్లేయర్ నయోమీ ఒసాకా.. దివంగత దిగ్గజ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రయాంట్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది. తాజాగా యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన ఆమె.. మీడియా సమావేశానికి బ్రయాంట్ జెర్సీ ధరించి వచ్చింది.
బ్రయాంట్ జెర్సీ ధరించిన ఒసాకా "బ్రయాంట్.. నేను ఎలా ఉంటానని అనుకున్నారో అలాగే ఉండాలనుకుంటున్నా. ఆయన నన్ను గొప్పదానివి అవుతావని అనేవారు. కచ్చితంగా భవిష్యత్తులో అలానే అవుతా."
- నయోమీ ఒసాకా, టెన్నిస్ ప్లేయర్
యూఎస్ ఓపెన్ ఫైనల్లో విక్టోరియా అజరెంకాపై గెలిచిన ఒసాకా.. కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ అందుకుంది. ఈ మ్యాచ్‌లో 1-6, 6-3, 6-3 తేడాతో విజయం సాధించింది ఒసాకా. తద్వారా మూడూ గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన తొలి ఆసియా ప్లేయర్‌గానూ ఘనత సాధించింది.
ఈ ఏడాది జనవరిలో విమాన ప్రమాదంలో మృతి చెందారు ఎన్బీఏ లెజెండ్ కోబ్ బ్రయాంట్. 41 ఏళ్ల కోబ్..9 మంది సభ్యులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా అమెరికా కాలిఫోర్నియాలోని కలాబసాస్ కొండ ప్రాంతంలో అది కుప్పకూలింది. ఈ ఘటనలో కోబ్తో పాటు అతని 13 ఏళ్ల కుమార్తె జియాన్నా కూడా ప్రాణాలు కోల్పోయారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్‌బాల్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ దిగ్గజం.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించారు. అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్లలో కోబ్ ఒకడిగా ఘనత సాధించారు.
దిగ్గజ ప్లేయర్ కోబ్ బ్రయాంట్