చాన్నాళ్ల తర్వాత మళ్లీ టెన్నిస్‌లో సందడి.. న్యూయార్క్ వేదికగా యూఎస్ ఓపెన్ ఆరంభమైంది! సోమవారం, తొలిరోజు టాప్‌సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కెర్బర్ (జర్మనీ) ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్లిస్కోవా 6-4, 6-0తో కలినినా (ఆర్మేనియా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు కొట్టిన ఈ చెక్ అమ్మాయి.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది. రెండో సెట్లో ఆమె కలినినాకు ఒక్క గేమ్ కూడా గెలిచే అవకాశాన్ని ఇవ్వలేదు.
మరోవైపు పదిహేడో సీడ్ కెర్బర్ 6-4, 6-4తో టామ్‌జనోవిచ్ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్‌లో 15 విన్నర్లు కొట్టిన కెర్బర్.. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసింది.
మ్లదనోవిచ్ (ఫ్రాన్స్) కూడా తొలి రౌండ్ దాటింది. ఆమె 7-5, 6-2తో బాప్టిస్టె (అమెరికా)ను ఓడించింది.
వోండ్రుసోవా 6-1, 6-4తో మినెన్ (జర్మనీ)పై గెలిచి రెండోరౌండ్ చేరగా.. క్విటోవా (చెక్ రిపబ్లిక్), గ్రెచెవా (రష్యా), గర్సియా (ఫ్రాన్స్), లొండెరొ (అర్జెంటీనా) ముందంజ వేశారు.
పురుషుల సింగిల్స్‌లో బోర్నా కొరిచ్ (క్రొయేషియా) తొలి రౌండ్ దాటాడు. అతను 7-5, 6-3, 6-1తో అండుజర్ (స్పెయిన్)ను ఓడించాడు.