తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రీడాస్ఫూర్తిపై మరో వివాదం... ఈసారి టెన్నిస్​

మియామి ఓపెన్​లో అండర్​ ఆర్మ్ షాట్​ ఆడి వివాదాస్పదమయ్యాడు ఆసీస్ ఆటగాడు నిక్ కిర్గియోస్. ప్రస్తుతం దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అండర్​ఆర్మ్​ షాట్​

By

Published : Mar 27, 2019, 9:12 AM IST

అండర్​ఆర్మ్​ షాట్​ ఆడిన నిక్​
రాజస్థాన్​- పంజాబ్ మధ్య సొమవారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో అశ్విన్​ మన్కడింగ్​పై వివాదం చెలరేగుతూనే ఉంది. ఇంతలో ఇదే తరహ విధానం టెన్నిస్​లోనూ జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న మయామి ఓపెన్​లో ఆస్ట్రేలియా ఆటగాడు నిక్​ కిర్గియోస్​ అండర్​ ఆర్మ్ షాట్​ ఆడి వివాదానికి కారణమయ్యాడు.

సెర్బియా ఆటగాడు డుసాన్ లాజోవిక్​తో తలపడిన నిక్.... అండర్​ ఆర్మ్ షాట్ ఆడాడు. ఈ మ్యాచ్​లో కిర్గియోస్ 6-3, 6-1 తేడాతో విజయం సాధించాడు. నిక్ గెలిచినప్పటికీ క్రీడాస్ఫూర్తిని పాటించలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెన్నిస్​లో అండర్​ఆర్మ్ షాట్ ఆడటానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఆటగాళ్లు. కానీ నిక్ అదేమి పట్టించుకోకుండా విమర్శల పాలయ్యాడు.

అండర్​ ఆర్మ్ షాట్ అంటే ఏంటీ?

సాధారణంగా టెన్నిస్​లో బంతిని పైనుంచి కొట్టాలి. కానీ.. కింద నుంచి ఆడడమే అండర్ ఆర్మ్ షాట్. ఇది ఆట నిబంధనలకు వ్యతిరేకం కానప్పటికీ క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పలువురు క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

క్రికెట్​లోనూ అండర్​ ఆర్మ్ అంశం వివాదాస్పమైంది. ​1981 ఆస్టేలియా- న్యూజిలాండ్ మ్యాచ్​లో కంగారూ ఆటగాడు ట్రెవెర్ చాపెల్ అండర్​ ఆర్మ్​ బంతిని వేసి వివాదాస్పదమయ్యాడు. ఒకప్పుడు ఇది క్రికెట్ నిబంధనలలో ఉంది. అనంతరం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ నిబంధనను తొలగించారు. భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్​ సోదరుడే ఈ ట్రెవెర్ చాపెల్. అప్పడు ఆస్ట్రేలియా సారథిగా ఉన్న గ్రెగ్ .. అండర్​ ఆర్మ్​ బంతిని వేయడానికి సోదరుడిని ఉసిగొలిపాడు.

ABOUT THE AUTHOR

...view details