అమెరికన్ టెన్నిస్ డబుల్స్ కవలల జోడీ బాబ్- మైక్ బ్రయాన్.. 25 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికారు. అది కూడా యూఎస్ ఓపెన్ ప్రారంభానికి మూడు రోజుల ముందే. 1995లో ఇదే గ్రాండ్‌స్లామ్ టోర్నీతో టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
42 ఏళ్ల ఈ కవల సోదరులు.. మొత్తంగా 16 సార్లు గ్లాండ్స్లామ్ ఛాంపియన్స్‌గా నిలిచారు. 119 టూర్ లెవల్ టైటిల్స్ గెలుపొందారు. 2012 ఒలింపిక్స్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నారు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 10 సీజన్లలో నంబర్.1గా నిలిచి రికార్డు సృష్టించారు. 2007లో డేవిస్ కప్‌ను అమెరికా గెల్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు.