ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందే టెన్నిస్ సందడి షురూ కానుంది. శనివారంతో ఆటగాళ్లందరి క్వారంటైన్ గడువు ముగిసింది. దీంతో ఆదివారం నుంచి క్రీడాకారుల సాధన కోసం రెండు డబ్ల్యూటీఏ టోర్నీలు ఆరంభం కానున్నాయి. ఓ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ ఆష్లీ బార్టీకి తొలి రౌండ్లో బై లభించనుంది. మంగళవారం నుంచి అదే వేదికలో ఏటీపీ కప్ మొదలు కానుంది. 12 జట్లు తలపడే ఆ టోర్నీలో జకోవిచ్, నాదల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ దేశాల తరఫున ఆడనున్నారు. మరోవైపు వచ్చే నెల 8న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందే రెండు ఓటీపీ పురుషుల టోర్నీలు జరగనున్నాయి.
క్వారంటైన్ ముగిసే.. ప్రాక్టీస్ ప్రారంభమాయే.. - practice matches before australian open
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల క్వారంటైన్ శనివారంతో ముగిసింది. దీంతో ఆదివారం నుంచి క్రీడాకారుల ప్రాక్టీస్ నిమిత్తం రెండు డబ్ల్యూటీఏ టోర్నీలు జరుగనున్నాయి. ఇప్పటికే అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించారు.
14 రోజుల క్వారంటైన్లో గడిపిన ప్లేయర్లకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ప్రాక్టీస్ ఉండాలనే ఉద్దేశంతో ఈ టోర్నీలన్నీ నిర్వహించనున్నారు. ఇప్పటికే అగ్రశ్రేణి క్రీడాకారుల కోసం నిర్వహించిన ఎగ్జిబిషన్ టోర్నీలో.. ఒసాకాపై సెరెనా, బార్టీపై హలెప్ నెగ్గారు. థీమ్‌ను నాదల్ ఓడించాడు. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన ఆటగాళ్లు.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నద్ధమయేందుకు తొమ్మిది రోజుల సమయం ఉందని, అందరికీ మ్యాచ్ ప్రాక్టీస్ దక్కేలా చూస్తామని ఆ టోర్నీ సీఈఓ క్రెయింగ్ టిలీ పేర్కొన్నాడు. టోర్నీ తొలి ఎనిమిది రోజులు స్టేడియానికి 30 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఫైనల్స్‌కు మాత్రం పగటి పూట 12,500 మందిని, రాత్రి పూట 12,500 మందిని అనుమతిస్తారు.
ఇదీ చదవండి:బుమ్రా.. కుంబ్లేలా బౌలింగ్ వేస్తే..!