ఫ్రెంచ్ ఓపెన్ వరుసగా రెండో ఏడాది వాయిదా పడే అవకాశముంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో మరోసారి లాక్డౌన్ విధించారు. శనివారం మొదలైన లాక్డౌన్ మే రెండో వారం వరకు కొనసాగొచ్చు.
వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా!
ఈ ఏడాది కూడా ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా పడే అవకాశముంది. నిరుడు కరోనా వల్ల ఈ టోర్నీ నిర్వహించలేదు. ఈ సారీ అదే కారణంతో ఆటంకం ఏర్పడనుంది. సదరు విషయాన్ని ఫ్రాన్స్ క్రీడల మంత్రి ప్రకటించారు.
వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా
దీంతో ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా వేయడంపై ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్యతో మాట్లాడుతున్నామని ఆ దేశ క్రీడల మంత్రి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మే 23న ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. నిరుడు కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నాలుగు నెలలు ఆలస్యమైంది.