భారత్‌లోనూ జాతి వివక్ష ఉందని ఆరోపించాడు భారత టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్. తాను ఈశాన్య రాష్ట్రాలకు చెందినవాడు కావడం వల్ల చైనా వాడని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేశాడు.
"నేను ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చా. నాకు ఎనిమిదేళ్ల వయసులో మా కుటుంబం చెన్నైకి వలస వచ్చింది. చిన్నప్పుడు నన్ను కొంతమంది వాచ్‌మన్ అని పిలిచేవాళ్లు. బహుదూర్ అనేవాళ్లు. అప్పుడు చాలా బాధగా అనిపించేది. భారత్‌లో ఉన్నాం కాబట్టి వర్ణ వివక్ష, జాతి వివక్ష ఉండదనుకుంటే పొరపాటే. దక్షిణాదిన నల్లగా ఉన్న వాళ్లను ఆటపట్టిస్తుంటారు. కోల్‌కతాలో ఓసారి అయిదారుగురు పిల్లలు నన్ను 'చైనీస్' అని పిలిచి వాళ్లలో వాళ్లే నవ్వుకున్నారు. అప్పుడు నా భార్య వాళ్లను కొట్టాలని అనుకుంది. వాళ్లతో కలిసి ఆడి వారి తప్పు తెలిసేలా చేశాం"