కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ క్రీడా టోర్నీలన్నీ దాదాపుగా వాయిదాపడ్డాయి. ఫలితంగా క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడిప్పుడే లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా పలు దేశాల్లో క్రీడలకు సంబంధించిన టోర్నీలు మొదలవుతున్నాయి. టెన్నిస్ పోటీలు కూడా పునః ప్రారంభం కానున్నాయి.
ఈ పోటీల ద్వారా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మళ్లీ రాకెట్ పట్టేందుకు సిద్ధమౌతోంది. ఆగస్టు 10 నుంచి ప్రారంభమయ్యే కెంటకీ హార్డ్కోర్ట్ టోర్నీలో ఆమె బరిలోకి దిగబోతోంది. 2017 యూఎస్ ఓపెన్ ఛాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ కూడా పాల్గొననుందని నిర్వాహకులు వెల్లడించారు.