ఇప్పట్లో తాను రిటైర్ కానని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ స్పష్టం చేశాడు. 2021లో తాను పునరాగమనం చేయాలనుకుంటున్నానని చెప్పాడు. 39 ఏళ్ల ఫెదరర్ గాయం కారణంగా గత జనవరి నుంచి టెన్నిస్ టోర్నీల్లో ఆడలేదు.
"నేను ఇప్పట్లో రిటైర్ కావట్లేదు. గతవారం సాధన చేశా. జనవరిలో కోర్టులో అడుగుపెడతా. ఇంకా గాయం నుంచి కోలుకునే క్రమంలో ఉన్నా. నాలో ఇంకా కొంత ఆట ఉంది"