టెన్నిస్ పేరు చెబితే గుర్తొచ్చే ఆటగాడు జకోవిచ్. ఈ సెర్బియా ఆటగాడికి టెన్నిస్ అంటే ఎంత ఇష్టమో ప్రకృతి అంటే అంతే ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అతడు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా తన కుమార్తె పేరు వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన అంశాన్ని అతడు ట్విట్టర్ వేదికగా వివరించాడు. సెర్బియాలో 'తారా' అనే అందమైన పర్వతం పేరునే తన కుమార్తెకు పెట్టినట్లు స్పష్టం చేశాడు.
నా కూతురికి 'తారా' పేరు అందుకే పెట్టా: జకోవిచ్ - తారా పర్వతం
ప్రపంచ ఛాంపియన్ జకోవిచ్, జెలెనా దంపతుల ముద్దుల కూతురు పేరు 'తారా'. తన కుమార్తెకు ఆ అందమైన పేరు పెట్టడానికి ఓ ప్రత్యేమైన కారణం ఉందని తాజాగా వెల్లడించాడీ స్టార్ ప్లేయర్. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
అందుకే తనకు 'తార' అని పేరు పెట్టాను:జకోవిచ్
అద్భుతమైన 'తారా' వంటి రత్నాలు కలిగి ఉన్న దేశం(సెర్బియా) నుంచి వచ్చినందుకు మనం అదృష్టవంతులం అని జకోవిచ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి:జకోవిచ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన థీమ్