తెలంగాణ

telangana

ETV Bharat / sports

జిమ్​లో కసరత్తులు చేస్తున్న సానియా..​

భారత టెన్నిస్​ స్టార్ సానియా మీర్జా​ ప్రస్తుతం బరువు తగ్గేందుకు జిమ్​లో కసరత్తులు చేస్తోంది. తల్లి కావడం వల్ల ఆటకు దూరంగా ఉన్న ఈ స్టార్​ మళ్లీ ఆట మొదలుపెట్టేందుకు చెమటోడ్చుతోంది.

జిమ్​లో కసరత్తులు చేస్తున్న ఆ టెన్నిస్​ స్టార్ ఎవరు?​

By

Published : Oct 12, 2019, 6:32 PM IST

ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తిరిగి కోర్టులో అడుగు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తల్లి కావడం వల్ల కొన్నాళ్లుగా ఆమె ఆటకు దూరంగా ఉంది. గర్భిణిగా ఉన్న సమయంలో సానియా బరువు పెరిగింది. మళ్లీ ఇప్పుడు ఆట మొదలు పెట్టబోతోంది. అందువల్ల బరువు తగ్గించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. క్రమం తప్పకుండా జిమ్​లో కసరత్తులు చేస్తూ చెమటోడ్చుతోంది. ఫలితంగా నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిందీ క్రీడాకారిణి.

దేశానికి ఆటడమే తన ధ్యేయమని, కచ్చితంగా పూర్వ రూపు తెచ్చుకుంటానంటూ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తోంది సానియా. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె జిమ్‌లో కష్టపడుతున్న వీడియోలను షేర్‌ చేసింది. టెన్నిస్‌ ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఈ టెన్నిస్ స్టార్ నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది చదవండి: అత్యుత్తమ గోల్​ కన్నా శృంగారమే మిన్న: స్టార్ ఫుట్​బాలర్ రొనాల్డ

ABOUT THE AUTHOR

...view details